0%
నడుస్తున్న తెలంగాణ
ఒక సమాజ సంస్కారం వ్యక్తమయ్యేది బుద్ధిజీవులద్వారానే. అలాంటి ఆలోచనాపరులను తయారుచేసేది అక్షరం. అక్షర రూపం దాల్చిన జ్ఞానం సమాజం ఎల్లెడలా చైతన్యాన్ని వ్యాపిస్తుంది. అక్షరం పత్రికగా మారితే జ్ఞానం జనరాశుల్లోకి ప్రయాణిస్తుంది. ఘనీభవించిన సమాజ నిర్మాణాన్ని కదలబార్చే శక్తి పత్రికకు ఉంటుంది. పండిత సమూహంలో మాత్రమే తిరగాడే అక్షరం పత్రిక ద్వారా ప్రపంచపరమవుతుంది. అందుకే నడుస్తున్న తెలంగాణ పత్రిక ప్రజా కేంద్రంగా నిర్మాణమయింది. ఫ్యూడల్ వాసనలను త్యజించని తెలంగాణ సమాజాన్ని విశ్లేషించి గత వర్తమానాలతో ఎడతెగని సంభాషణ జరపాలని నడుస్తున్న తెలంగాణ లక్ష్యించింది.