‘కృత్రిమ మేధ’ ఈనాటి అనివార్య సందర్భం -డా. చంద్రయ్య శివన్న

కంప్యూటర్ వచ్చిన తొలిరోజుల్లో ఉద్యోగాల భద్రతకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా భయాందోళనలు వ్యక్తమయ్యాయి. వివిధ కార్యాలయాల్లో మనుషులు చేసే రోజువారీ డేటాఎంట్రీ, బుక్ కీపింగ్ మొదలైన పనుల్ని తొలిదశలో వచ్చిన కంప్యూటర్ చేసిపెట్టేది. ముఖ్యంగా మళ్లీ మళ్లీ చేసే ఒకే పనిని (రిపీటెడ్ గా) కంప్యూటర్ విసుగులేకుండా చేయడమనేది ఆ కాలంనాటికి ఒక అద్భుతం.  కంప్యూటర్, దానికున్న సామర్థ్యంవల్ల, కచ్చితత్త్వంవల్ల అనేకమంది ఉద్యోగాలను రీప్లేస్ చేసింది. ఉద్యోగులు తమకు అప్పటివరకు పరిచయంలేని కొత్త నైపుణ్యాలను, సాంకేతికను విధిగా నేర్చుకోవాల్సి వచ్చింది. దీనికి అలవాటుపడనివాళ్లు ఉద్యోగాలు కోల్పోయారు. కానీ అనతికాలంలోనే కంప్యూటర్ రంగంలో సరికొత్త ఉద్యోగాల కల్పన జరిగింది. సరిగ్గా ఇప్పుడు కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్-ఏఐ) సందర్భంలోనూ ఇదే రకమైన భయాందోళనలు వ్యక్తమవుతోన్నాయి. ఈ రెండు సందర్భాల్లో ఉన్న తేడా ఏంటంటే, అప్పుడు కంప్యూటర్ ను మనుషులు ఆపరేట్ చేసేవాళ్లు. కొన్ని యాంత్రికమైన పనులకోసం మాత్రమే ఉపయోగించేవారు. కానీ, ఇప్పుడున్న ఏఐ దానికదిగా ఒక మనిషి ఆలోచించినట్టు ఆలోచిస్తోంది. కొన్నిసార్లు అచ్చం మనిషిలానే నిర్ణయాలు తీసుకుంటోంది. పరిష్కారాల్ని సూచిస్తోంది. ఎప్పటికప్పుడు కొత్త విషయాల్ని నేర్చుకుంటోంది. అనేక రకాల అనుభవాలద్వారా ‘డీప్ లర్నింగ్’ చేస్తోంది. ఎప్పటికప్పుడు తన జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకుంటోంది. ఇది మానవ మేధను రీప్లేస్ చేయడానికి క్రమంగా సంసిద్ధమౌతోంది.

Some more:

Recent Posts/Updates